తెలుగు
te తెలుగు en English
జాతీయం

PM Modi: ‘మూడోసారి ప్రధాని అయ్యా.. భారత్ ను బలమైన మూడో ఆర్థికశక్తిగా నిలబెడతా’

రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మాస్కోలోని భారత సంతతికి చెందిన ప్రజలతో నేడు సమావేశం అయ్యారు. మోడీ మాట్లాడుతూ.. సవాళ్లను సవాల్ చేయడం నా తత్వం.. అది నా డీఎన్ఏలోనే ఉందని ప్రధాని అన్నారు. భారతదేశ ఘనతను ప్రపంచ దేశాలు గుర్తించక తప్పని పరిస్థితికి తాము తీసుకు వచ్చామన్నారు. భారత్- రష్యా మైత్రి కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పుకొచ్చారు. మన దేశం కష్టసుఖాల్లో రష్యా ఎప్పుడూ తొడుగా నిలిచిందన్నారు. వార్ జోన్ నుంచి భారత విద్యార్థులు సురక్షితంగా బయట పడేందుకు సాయపడినందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. రష్యాకు తానొక్కడినే రాలేదని 140 కోట్ల మంది ప్రజల ప్రేమను, భారతదేశ మట్టి వాసనను మోసుకొచ్చానని పేర్కొన్నారు. అలాగే, ఆత్మ విశ్వాసం భారత్‌కు అతిపెద్ద ఆయుధం అని ప్రధాని మోదీ వెల్లడించారు.

Read also: Budjet: వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మల సీతారామన్

మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పటిష్టంగా ఉందని ప్రధాని తెలిపారు. త్వరలోనే మూడో ఆర్థిక శక్తిగా అవతరించబోతుందన్నారు. వరుసగా మూడు సార్లు ఒకే పార్టీ అధికారంలోకి రావడం దాదాపు 60 ఏళ్ల తర్వాత జరిగిందన్నారు. రాబోయే 10 ఏళ్లు భారత దేశానికి అత్యంత సంక్లిష్టమైన సమయం. ఈ సందర్భంగా రష్యాలోని కజాన్‌లో 2 కొత్త కాన్సులేట్‌లను ప్రారంభించబోతున్నట్లు మోదీ ప్రకటించారు. రష్యాలో ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button