తెలుగు
te తెలుగు en English
జాతీయం

PM Modi: సికింద్రాబాద్- విశాఖ కొత్త వందేభారత్ రైలు.. ప్రారంభించిన మోడీ

సికింద్రాబాద్- విశాఖపట్టణం మధ్య రెండో వందేభారత్‌ రైలును ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం వర్చువల్ గా ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్ ప్లాట్ ఫాం నంబర్ 10 పైన వందేభారత్ రైలుకు పచ్చ జెండా ఊపి కిషన్ రెడ్డి, రైల్వే అధికారులు ప్రారంభించారు.

Also read: TSRTC: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. మెట్రో ఎసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వందేభారత్​ ఎక్స్ ​ప్రెస్​ రెండు తెలుగు​ రాష్ట్రాల మధ్య ఆరు రోజుల పాటు నడవనుంది. కేవలం గురువారం మాత్రమే ఈ రైలు నడవదు. వరంగల్​, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వేస్టేషన్లలో ఆగనుంది. మొత్తం 530 మంది ఇందులో ప్రయాణించవచ్చు.

ఇది తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే ఐదో వందే భారత్ రైలు కాగా.. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రెండోది కావడం విశేషం. మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు విశాఖ- భువనేశ్వర్ మధ్య ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రానికి మరో వందేభారత్ రైలు రావడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button