తెలుగు
te తెలుగు en English
జాతీయం

RBI: రూ.10, 20 నాణేలు తీసుకోని వారికి మూడేళ్ల జైలు శిక్ష!

ఇటీవల కాలంలో చాలా మంది దుకాణదారులు రూ. 10, 20 రూపాయల నాణేలు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇవి నకిలీవని, చెల్లవని చెబుతున్నారు. అంతేకాదు, ఈ రూమర్ సొసైటీలో బాగా స్ప్రెడ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి స్పందించింది. ఈ నాణేలు తీసుకోకపోతే చట్టరీత్యా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, జైలు శిక్ష కూడా ఉంటుందని స్పష్టంచేసింది.

ఫిర్యాదు చేయొచ్చు!

ప్రభుత్వం ఆమోదించిన నాణేలను తిరస్కరించడం నేరం అవుతుందని స్పష్టం చేసింది. తిరస్కరించడమే కాకుండా అవి చెల్లవంటూ సోషల్​ మీడియాలో ప్రచారం చేసినా శిక్ష ఖాయమని హెచ్చరిస్తోంది. 10, 20 రూపాయల నాణేలు చెలామణీలో ఉన్నాయని వాటిని తిరస్కరిస్తే ఫిర్యాదు చేయాలని సూచిస్తోంది. ఎవరైనా నిరాకరిస్తే ఐపీసీ సెక్షన్ 124 ప్రకారం ఫిర్యాదు చేయాలని, విచారణలో ఆ విషయం రుజువైతే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని ఆర్​బీఐ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో ఇప్పటికే కొన్ని దుకాణాలు, ప్రాంతాల్లో రూ.10 నాణెం తీసుకోని వారు మూడు సంవత్సరాల జైలుకు గురవుతారు అంటూ ఆర్బీఐ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button