తెలుగు
te తెలుగు en English
జాతీయం

Supreme Court: ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపాటు

ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌ బఫర్‌ జోన్లలో మాత్రమే సఫారీని నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. అడవి మధ్య భాగంలోకి ప్రవేశించి పులుల జీవనాన్ని దెబ్బతీయవద్దని హెచ్చరించింది. పార్క్‌ మధ్యలో పులుల సఫారీ, జూను ఏర్పాటు చేసి జంతువులను బోన్లలో ప్రదర్శనకు ఉంచాలని గతంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా జంతు ప్రేమికుడు, లాయర్‌ గౌరవ్‌ బన్సల్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, తాజాగా తన తీర్పును వెలువరించింది.

ALSO READ:  తెలంగాణకు రానున్న ఎన్‌డీఎస్ఏ బృందం.. జలసౌధలో భేటీ

ఈ కేసును సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ పీకే మిశ్రా, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం విచారించింది. ‘ఒక అడవి పులిని రక్షిస్తే.. పులి అడవిని రక్షిస్తుంది. వాటి సంరక్షణ నిబంధనలకు సఫారీ నిర్వహణ విరుద్ధం. అయినా కానీ, ఉపాధిని దృష్టిలో పెట్టుకొని కేవలం నేషనల్‌ పార్క్‌ బఫర్‌ జోన్‌లో మాత్రమే దానిని నిర్వహించేందుకు కోర్టు అనుమతిస్తోంది. సఫారీ పర్యటనలో కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే’ అని ముగ్గురు సభ్యుల ధర్మాసనం సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button