
Train Accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం
మహారాష్ట్రలోని జల్‌గావ్ ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో నుంచి మహారాష్ట్రలోని ముంబైకి ప్రయాణిస్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు రైలులో నుంచి కొందరు ప్రయాణికులు చైన్ లాగి పక్కనే ఉన్న ట్రాక్ పైకి దూకారు. అయితే, అదే సమయంలో వారు దూకిన ట్రాక్‌పైకి బెంగళూరు ఎక్స్‌ప్రెస్ దూసుకురావడంతో 8 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. పదుల సంఖ్యలో తీవ్రగాయాలపాయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
భయపడటంతోనే ప్రమాదం..!
అయితే, పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగలేదని.. అవన్నీ పుకార్లేనని వార్తలొస్తున్నాయి. ప్రయాణికులు అనవసరంగా భయపడటంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా గుర్తించారు. పట్టాలపై పడిన ప్రయాణికులను బెంగళూరు ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో వారి మృతదేహాలు ఛిద్రం అయిపోయాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.