తెలుగు
te తెలుగు en English
జాతీయం

Train Accident: భాగమతి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద ఘటన.. పలు రైళ్లు రద్దు!

తమిళనాడులో శుక్రవారం రాత్రి భారీ రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్‌ (12578) రైలు వేగంగా వచ్చి తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలును ఢీకొంది. 13 కోచ్‌లు పట్టాలు తప్పాయి.

ఈ మార్గాల్లో రైళ్లు రద్దు!

ఈ క్రమంలో దక్షిణ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. తిరుపతి-పుదుచ్చేరి మెము, పుదుచ్చేరి-తిరుపతి మెము, డా ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- తిరుపతి ఎక్స్‌ప్రెస్‌(పలు రైళ్లు), తిరుపతి-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌(పలు రైళ్లు), అరక్కం-పుదుచ్చేరి మెము, కడప-అరక్కోణం మెము, డా. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- తిరుపతి మెము, తిరుపతి-డా. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ మెము, అరక్కోణం-తిరుపతి మెము, తిరుపతి-అరక్కోణం మెము, విజయవాడ-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ పినాకిని ఎక్స్‌ప్రెస్‌, సూళ్లూరుపేట-నెల్లూరు మెము ఎక్స్‌ప్రెస్‌, నెల్లూరు-సూళ్లూరుపేట మెము ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దయ్యాయి.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button