తెలుగు
te తెలుగు en English
జాతీయం

Vandebharath: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందేభారత్‌ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ

కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు మరో శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం మరో రెండు వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ రైలును సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్, భువనేశ్వర్- విశాఖపట్నం, సికింద్రాబాద్- విశాఖ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇది విశాఖపట్నం నుంచి ప్రయాణించే నాలుగోది. రాయ్‌పుర్‌-విజయనగరం మార్గంలో ఇది మొదటిది. దీంతో పాటు నాగ్‌పుర్‌-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను కూడా మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్‌-నాగ్‌పుర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు 19వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

దుర్గ్-విశాఖపట్నం (20829) వందే భారత్.. దుర్గ్ నుంచి వారానికి 6 రోజులు(గురువారాలు మినహా) 05.45 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు 13.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం-దుర్గ్ (20830) వందే భారత్ విశాఖపట్నం నుంచి వారానికి 6 రోజులు (గురువారాలు మినహా) 14.50 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 22.50 గంటలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈ నెల 20 నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరగనుంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button