తెలుగు
te తెలుగు en English
జాతీయం

Vijay: ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రజాస్వామ్యానికి విరుద్ధం.. తీర్మానం చేసిన టీవీకే అధినేత విజయ్!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని చూస్తున్న ఒకే దేశం – ఒకే ఎన్నిక (జమిలీ ఎన్నిక)పై ప్రముఖ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం – ఒకే ఎన్నికను అమలు చేసే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని, ఈ చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా తమ పార్టీ తీర్మానం చేస్తున్నట్లు తెలిపారు. తన పార్టీ జిల్లా ఆఫీస్‌ బేరర్లు, కార్యవర్గ సభ్యులతో ఆదివారం తొలిసారి సమావేశం నిర్వహించారు.

మొత్తం 26 తీర్మానాలు

ఈ సందర్భంగా టీవీకేని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ప్రజలకు చేరువయ్యే అంశాలపై ప్రధానంగా చర్చించి 26 తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా డీఎంకే, బీజేపీ పాలనపై మండిపడిన విజయ్‌.. తమిళనాడులో శాంతిభద్రతల అంశంపై విమర్శలు గుప్పించారు. తమిళనాడులో కులగణన చేపట్టాలని కోరిన ఆయన.. పరందూర్‌ విమానాశ్రయం ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నిర్దేశిత గడువు నిర్దేశించుకొని క్రమంగా మద్యం దుకాణాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button