తెలుగు
te తెలుగు en English
జాతీయం

Vijay: దళపతి విజయ్ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు

తమిళ్ స్టార్ హీరో, దళపతి విజయ్‌కి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. విజయ్‌ రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగంను (టీవీకే) ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తించింది. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘తమిళగ వెట్రి కజగం’ను రాజకీయ పార్టీగా నమోదు చేయాలని మేము గత ఫిబ్రవరి 2వ తేదీన భారత ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాము. మన దేశ ఎన్నికల సంఘం దీనిని చట్టబద్ధంగా పరిగణించి ఇప్పుడు మన పార్టీని రాజకీయ పార్టీగా నమోదు చేసి, రిజిస్టర్డ్ పార్టీగా ఎన్నికల రాజకీయాలలో పాల్గొనేందుకు అనుమతించింది. దీన్ని మీకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని విజయ్ చెప్పారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button