తెలుగు
te తెలుగు en English
జాతీయం

Yuvaraj: ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదు: యువరాజ్ సింగ్

టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయడం లేదని స్పష్టంచేశారు. ‘నేను గురుదాస్‌పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ప్రతిభ కలిగిన వారికి సహాయం చేయడం, మద్దతుగా ఉండటం గురించే ఆలోచిస్తున్నా. నా ఫౌండేషన్ ద్వారా ఆ పనులు చేస్తాను.’ అని యువీ ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో రాసుకొచ్చారు.

ALSO READ: ఇంటర్ విద్యార్థులకు ఊరట… నిమిషం నిబంధన తొలగింపు

కాగా.. ఇటీవల యువరాజ్ సింగ్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఆయన గడ్కరీని ఎందుకు కలిశారో తెలియకున్నా ఆయన రాజకీయాల్లో చేరుతారని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి యువీ బీజేపీ తరుఫున ఎన్నికల బరిలో ఉండనున్నట్టు ప్రచారం జరిగింది. తాజాగా ఆ వార్తల్ని యువరాజ్ సింగ్ కొట్టిపారేశారు.

One Comment

  1. чешется нос психосоматика,
    чешется нос снаружи причины видеть молнию во сне завод звезда вакансии, сск звезда вакансии зарплата повешенный 78 дверей значение, верховный жрец 78
    дверей аркан 13 смерть личность

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button