తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Allu Arjun: సీఎంకి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి డిమాండ్!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తన ఇమేజ్‌ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడటం సరికాదన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు లీగల్‌ టీం ఒప్పుకోలేదనటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం

కాగా.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటన విషయంలో అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్న మాదిరి పరిస్థితి మారిపోయింది. నిన్న అసెంబ్లీలోనూ ఈ అంశంపై వాడీవేడీగా చర్చగా జరిగింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు వద్దని చెప్పినా వినకుండా అల్లు అర్జున్ వినకుండా రోడ్ షో చేయడం వల్లే తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందిందిన రేవంత్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తనపై చేసేవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. తన క్యారెక్టర్‌ను తప్పుగా ప్రొజెక్ట్ చేయడం ఏమాత్రం సరికాదన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button