తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Balapur: రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేశుడి లడ్డూ!

తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ మహాగణపతి తరువాత భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించేది బాలాపూర్ గణేశుడు. ప్రతీయేటా ఇక్కడ లడ్డూ ధర రికార్డు స్థాయి ధర పలుకుతుంది. బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. ఇక్కడి లడ్డూను దక్కించుకుంటే సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇక, ఈ ఏడాది రూ.30,01,000లకు సింగిల్ విండో ఛైర్మన్ కొలను శంకర్ రెడ్డి చేజిక్కించుకున్నారు. ఇక, గత ఏడాది బాలాపూర్ లడ్డూ ధర రూ. 27లక్షలకు దయానంద రెడ్డి దక్కించుకున్న విషయం తెలిసిందే. కొనసాగుతోంది.

1994 నుంచి బాలాపూర్‌లో లడ్డూ వేలం పాట కొనసాగుతోంది. 1994 నుంచి బాలాపూర్‌లో లడ్డూ వేలం పాట కొనసాగుతోంది. మొదట రూ.450తో ప్రారంభం కాగా.. 2016లో రూ.14.65 లక్షలు, 2017లో రూ.15.60లక్షలు, 2018లో రూ.16.60 లక్షలు, 2019లో 17.60 లక్షలు, 2021లో రూ.18.90 లక్షలు, 2022లో రూ.24.60 లక్షలు పలికింది. 2020లో కరోనా కారణంగా వేలం పాట రద్దు చేశారు. బాలాపూర్‌ ముఖ్య కూడలిలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button