తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Bandla Ganesh: టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావాలా..? సినిమా స్టార్స్‌పై బండ్ల గణేశ్ కాంట్రవర్షియల్ ట్వీట్!

బండ్ల గణేశ్‌కు సినిమాల్లో నటుడిగానూ, నిర్మాతగానూ రాని గుర్తింపు ఏదైనా ఒక్క పొలిటికల్ కామెంట్ చేస్తే చాలు, ఓ వారం రోజుల పాటు సోషల్ మీడియాలో ఆయనే ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా అలాంటి కామెంటే ఆయన మరోసారి చేశారు. అయితే ఈసారి ఆ కామెంట్ వేరెవరినో ఉద్దేశించి కాదు, తన సొంత సినిమా పరిశ్రమను ఉద్దేశించే.

టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికే సీఎం కావాలా?

సోషల్ మీడియాలో బండ్ల గణేశ్ చేసే పోస్ట్‌లకు, ట్వీట్‌లకు యమ క్రేజ్ ఉంటుంది. తాజాగా ఆయన సినిమా ప్రముఖులను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు. దాంతో ఆయనకు పలువురు విషెస్ తెలిపారు. రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డికి విషెస్ తెలిపారు. అయితే కొంతమంది సినిమా వాళ్లు రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపలేదని బండ్లగణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ షేర్ చేశారు. ‘గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టుపై భిన్న స్పందనలు వస్తున్నాయి. బర్త్ డేలకు విషెస్ కోసం అడుక్కోవడమేంటి అంటూ కొందరు కామెంట్లు పెడుతుండగా, మరికొందరేమో సినిమా వాళ్లను క్రిటిసైజ్ చేస్తున్నారు. కాగా.. బండ్ల గణేశ్ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉంటున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button