
KCR: బడ్జెట్ పై కేసీఆర్ విమర్శలు.. ప్రజలు ఆశలు ఒమ్ము చేశారని కామెంట్స్
రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. రైతులను పొగిడినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. తాము ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, మత్స్యకారులకు భరోసా లేదని, గొర్రెల పంపిణీ పథకాన్ని పూర్తిగా మూసివేసినట్లు కనిపిస్తోందని దుయ్యబట్టారు. బడ్జెట్ లో దళిత బంధు ప్రస్తావన లేదని పేర్కొన్నారు.
Read also: Union Budget 2024-25: బిహార్‌కు నిధుల వరద.. ఏపీకి అప్పుల బురద..!
ఒక్క కొత్త పథకం ప్రవేశపెట్టలేదని, రాష్ట్రంలో వ్యవసాయ, పరిశ్రమల సంగతి ఏంటని ప్రశ్నించారు. రైతులను, వృత్తికార్మికులను ప్రభుత్వం వంచించిందని విమర్శించారు. వ్యవసాయం, పారిశ్రామిక, ఐటీ పాలసీలు ప్రకటించలేదని ఆయా రంగాల అభివృద్ధికి ఏం చర్యలు తీసుకుంటున్నారో విధివిధానాలు బడ్జెట్ లో లేదన్నారు. ఉన్న పథకాలను మూసివేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. ప్రభుత్వానికి ఆర్నెళ్ల సమయం ఇవ్వాలనే తాను అసెంబ్లీకి రాలేదని కేసీఆర్ స్పష్టం చేశారు.