తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

KTR: సీఎం రేవంత్ సవాల్ కేటీఆర్ రియాక్ట్.. దమ్ముంటే పోటీకి రావాలని కౌంటర్

సీఎం రేవంత్ రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డికి దమ్ముంటే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయి అని ఘాటుగా విమర్శించారు. ఆడబిడ్డలకు రూ. 2,500 ఇవ్వు.. ఇచ్చిన 420 హామీలను అమలు చెయ్యి.. ఆడవాళ్లు రాజకీయాల్లో గెలవొద్దా.. ఇవేం మాటలు అని అసహనం వ్యక్తం చేశారు.

Also read: Telangana Government: డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్.. త్వరలోనే పరీక్ష తేదీల విడుదల

సీఎం రేవంత్ రెడ్డికి ఇన్ ప్రియారిటి కాంప్లెక్స్ ఉంది. కొడంగల్, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పోటీ చేసి సవాల్ విసిరి పారిపోయిండు. ఆయన మాటకు ఏం విలువ ఉందని కేటీఆర్ ఘాటుగా స్పందించారు. నేను సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. రేవంత్ రెడ్డికి దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేయాలి. మల్కాజ్ గిరి నుంచి పోటీ చేద్దాం.. అంటూ కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు.

రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. నాది మేనేజ్ మెంట్ కోటా అయితే.. రాహుల్, ప్రియాంకది ఏం కోటా అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ ది పేమెంట్ కోటా .. మాణిక్కం ఠాకూర్ కు డబ్బులిచ్చి తెచ్చుకున్న పేమెంట్ కోటా కాదా అని కేటీఆర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button