తెలంగాణ
BRS: తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత
తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత రెండు నెలలుగా బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన ఇవాళ మృతి చెందారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో బాలకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ ఆవిర్బావం తర్వాత ఆ పార్టీలో చేరారు. 2009 టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురై పార్టీకి దూరమయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో.. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, అనంతరం మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.