తెలుగు
te తెలుగు en English
Linkin Bioతెలంగాణ

CM Revanth: గురు భక్తి.. టీడీపీ రుణం తీర్చుకునేందుకు సిద్ధమైన సీఎం రేవంత్ రెడ్డి?

టీడీపీ అంటేనే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటేనే టీడీపీ.. ఇది ఒకప్పటి మాటే అయినా చాలా గట్టిగా వినిపించిన మాట. ఎవరు అవునన్నా.. కాదన్న రేవంత్ రెడ్డిలో ఇప్పటికీ టీడీపీ రక్తమే 70 శాతం వరకు ప్రవహిస్తూ ఉంటుంది. అవును మరి.. ఆ పార్టీలోనే కదా రేవంత్ రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగింది. ఆ పార్టీతో ఆయన అనుబంధం ఎన్నటికీ, ఎప్పటికీ చెరిగిపోనిది. అందుకే రేవంత్‌కి చంద్రబాబు నాయుడు అన్నా, ఆ పార్టీ అన్నా ఇప్పటికీ ఎనలేని భక్తి, గౌరవం. ఏదో రాష్ట్రం విడిపోయి ఆ పార్టీని విడిచిపెట్టారు కానీ.. లేదంటే టీడీపీలో రేవంతే నంబర్ 2.

ప్రభుత్వ స్థలంలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం!

రాజకీయంగా తనను ఇంత ఉన్నత స్థానానికి తీసుకొచ్చిన ఆ పార్టీ రుణం, లేదా చంద్రబాబు రుణం ఎలాగైనా తీర్చుకోవాలనుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డి ముందుకు ఓ ప్రపోజల్ వచ్చింది. ఇంకేముంది.. తన మనసులోనూ అదే ఉంది కాబట్టి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ‘ఓకే’ అనేశారట. నేరుగా చంద్రబాబు రుణం తీర్చుకోలేకపోయినా, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ రుణం అయినా తీర్చుకునే అవకాశం వచ్చిందని మనసులో పొంగిపోయారట. ఇంతకీ ఆ ప్రపోజల్ ఏంటో కాదు. హైదరాబాద్‌లో అవుటర్ రింగ్ రోడ్ సమీపంలో ఎన్టీఆర్ 100 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం. ఎన్టీఆర్ కొడుకు నందమూరి మోహనకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్, కమిటీ సభ్యుడు మధుసూదన రాజు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఎన్టీఆర్ విగ్రహం గురించి విన్నవించగానే సీఎం వెంటనే ఓకే అనేశారట. అంతేకాదు, ప్రభుత్వం కేటాయించే స్థలంలో 100 అడుగుల ఎన్టీఆర్ భారీ విగ్రహం మాత్రమే కాదు, ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామని, దానిని గొప్ప పర్యాటక కేంద్రంలా తీర్చిదిద్దుతామని హామీ కూడా ఇచ్చేశారట. సీఎం రేవంత్ చూపిస్తున్న ఈ ‘గురుభక్తి’పై తెలంగాణ ప్రజలు ఎలా స్పందిస్తారో మరి!

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button