తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Congress: నిరుద్యోగులకు త్వరలో మరో శుభవార్త

నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను వెలువరించేందుకు కాంగ్రెస్ సన్నద్ధం అవుతోంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లోని పోస్టులతో సహా ఆర్థిక శాఖ తాజాగా అనుమతిచ్చిన కొత్త పోస్టులతో కలిపి మొత్తం 11,060 పోస్టులతో మెగా డీఎస్సీని ఈవారంలోనే ప్రకటించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్థికశాఖ నిన్న రెండు వేర్వేరు జీవోలను కూడా జారీ చేసింది.

ALSO READ: ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు: ఈసీ

తాజా సమాచారం ప్రకారం ఈ పోస్టుల్లో 6,500కు పైగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులున్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులు 2,600, పండిట్‌ పోస్టులు 700, పీఈటీలు 190 పోస్టులున్నట్టు తెలిసింది. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత టీచర్ ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇప్పటికే గురుకులాల్లో ఖాళీగా ఉన్న పది వేల పోస్టుల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తోంది. డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీ పక్రియ సగం పూర్తైంది. మరికొన్ని రోజుల్లోనే వీరికి నియామక పత్రాలు అందించనున్నారు. మరోవైపు త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ సైతం వెలువడనుండటంతో టీచర్ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్నవారు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button