తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Congress: విద్యకే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం: మంత్రి పొన్నం

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం రాష్ట్రంలో విద్యాభివృద్ధికేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు మించి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమం ద్వారా గర్ల్స్ ప్రైమరీ స్కూల్ & హై స్కూల్‌లలో రెనోవేశన్ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. అనంతర మీడియాతో మాట్లాడారు.

ALSO READ: చట్టసభ సభ్యుల అవినీతి కేసులపై ‘సుప్రీం’ సంచలన తీర్పు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత విద్యారంగ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని అన్నారు. ‘మారుతున్న కాలానికి అనుగుణంగా, సాంకేతికతతో మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో మరిన్ని సౌకర్యాలు సమకూర్చనున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని గురుకులాలను పేద విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల నియామకాన్ని కూడా వేగవంతం చేసినట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button