తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Congress: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రభుత్వం కసరత్తు… ఇళ్లు నమూనా విడుదల!

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే వారికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల సాయం అందించనుంది. ప్రజాపాలన దరఖాస్తుల్లో వివరాలు నమోదు చేసుకున్న అర్హులందరికీ ఈ పథకం వర్తింప చేస్తామన్నారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి డిజైన్లు, నమూనాలు తయారు చేశారు. తప్పనిసరిగా కిచెన్, టాయిలెట్ ఉండేలా డిజైన్లు రూపొందించారు.

Also Read: మహిళలకు ప్రధాని గుడ్‌ న్యూస్‌… త్వరలో నిధులు విడుదల

తొలి నమూనాను సింగల్ బెడ్‌రూం ఇల్లుగా రూపొందించారు. ఇంటి నమూనాలో ఓ కిచెన్, బెడ్ రూం విత్ అటాచ్డ్ వాష్ రూం, హాల్, కామన్ బాత్ రూం, ఇంటి పైకి వెళ్లడానికి మెట్లు, ఇంటి ముందు మొక్కలు పెంచేందుకు బాల్ కనీ, బైక్ పార్కింగ్ కోసం జాగా, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ వంటి సదుపాయాలు కల్పించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకానికి మొత్తం 82 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దశల వారీగా రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read: సోషల్ మీడియాలో ‘సిద్ధం’ ప్రభంజనం..15లక్షల మంది!

త్వరలో లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నందున ఈ లోపే మరిన్ని గ్యారంటీలు అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. వీటిలో ముఖ్యంగా మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా మహిళలకు 2 వేల 500 రూపాయలు, రైతులకు రుణమాఫీ వంటివి ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button