తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

DSP’s Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో ప్రభుత్వ అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్‌, పోలీస్ శాఖల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా పోలీసుశాఖలోనే భారీగా బదిలీలు చేపట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీస్ శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది. 47 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం లోక్ సభ నియోజకవర్గాన్ని యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుని పోలీస్ శాఖ ఈ బదిలీలను చేపట్టింది. ఒకే పార్లమెంట్ పరిధిలో నాలుగేళ్లు పని చేసిన డీఎస్పీలను తాజాగా పోలీస్ శాఖ బదిలీ చేసింది.

ALSO READ: మార్చి 5: చరిత్రలో ఈ రోజు

అయితే 22 రోజుల్లో డీఎస్పీలను అయిదోసారి బదిలీ చేస్తూ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 12వ తేదీ నుంచి మొదలైన ఈ బదిలీల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి 47 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిలో ఇటీవలే ట్రాన్స్ ఫర్ అయిన అధికారులు కూడా ఉండటం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button