తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Farmer loan waiver: రైతులకు శుభవార్త.. రుణమాఫీ నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్!

రైతు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వివిధ కారణాలతో రుణమాఫీ కాని 3.14 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రూ.2,747 కోట్లు విడుదల చేసింది. మహబూబ్‌నగర్‌లో జరిగిన ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నిధులు విడుదల చేశారు. అయితే ఈ ఏడాది మూడు విడుతల్లో 22.22 లక్షల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ. 18 వేల కోట్లను జమ చేయగా, తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్‌లో నిర్వహించిన రైతు పండుగ వేదిక నుంచి నాలుగో విడతగా మరో 3,13,897 రైతుల ఖాతాల్లోకి రూ.2747.67 కోట్లు జమ చేశారు.

‘రైతులకు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలే’

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శల వర్షం కురిపించారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 25 లక్షల రైతు కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఈ విధంగా రైతు రుణమాఫీ చేశారా? అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో రైతు ఎన్నో కష్టాలు పడ్డారని విమర్శించారు. దేశంలో రైతులకు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని అన్నారు. రైతులకు సంబంధించి ఏదైనా పేటెంట్ ఉందంటే.. అది కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, ఈ విషయంలో చర్చించేందుకు ఎవరొచ్చినా సిద్దంగా ఉన్నానని సవాలు విసిరారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button