తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Game Changer: తెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’ టిక్కెట్ల ధరల పెంపు.. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు!

లేదు.. లేదంటూనే ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై సీఎం రేవంత్ రెడ్డి వరం కురిపించారు. రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ‘గేమ్ ఛేంజర్’ నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు చివరకు సీఎంను ఒప్పించి టిక్కెట్ల రేట్లు పెంచుకున్నారు. జనవరి 10న సినిమా విడుదల రోజు ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు ప్రభుత్వం పర్మిషన్‌ ఇచ్చింది. రిలీజ్‌ రోజు సింగిల్ స్క్రీన్స్‌లో అదనంగా రూ.100, మల్టీప్లెక్సుల్లో అయితే అదనంగా రూ.150 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో అదనంగా రూ.50, మల్టీప్లెక్సుల్లో అదనంగా రూ.100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.అయితే రిలీజ్ రోజు అర్ధరాత్రి 1 గంట షోకు మాత్రం ప్రభుత్వం నో చెప్పింది.

అప్పుడు అలా..!

మరోవైపు, ‘గేమ్ ఛేంజర్’ సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో ఇక, రాష్ట్రంలో స్పెషల్ షోలు, టిక్కెట్ల రేట్ల పెంపు ఉండదని సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ ఖరాకండీగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు నిర్మాతగా ఉన్న ‘గేమ్ ఛేంజర్’కి ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. కాగా.. గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా ఉన్న దిల్ రాజును సీఎం రేవంత్ ఇటీవల ఎఫ్‌డీ‌సీ ఛైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button