తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Harish Rao: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. హరీశ్ రావుపై కేసు నమోదు!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ అంశంలో మరో కీలక పరిణామ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావులు తన ఫోన్‌ను ట్యాప్ చేయించారని సిద్ధిపేటకు చెందిన చక్రధర్ రావు అనే వ్యక్తి హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన అనంతరం తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చక్రధర్ ఫిర్యాదుతో హరీశ్ రావుపై 120(బీ), 386,409,506 యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

Also Read: పవన్.. ‘సీజ్ ది షిప్’పై అనుమానాలు?

కాగా.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అసెంబ్లీలో కూడా తీవ్ర దుమారం చెలరేగింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారుల్ని సైతం అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తు శరవేగంగా జరుపుతోంది. ఇక, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ చేయించింది అని కాంగ్రెస్‌తో పాటు బీజేపీ సైతం ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న తరుణంలో ఈ వ్యవహారంలో తాజాగా హరీశ్ రావుపై కేసు నమోదు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే బీఆర్ఎస్ దీనిపై ఇంకా స్పందించలేదు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button