తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

HYD: హైదరాబాద్‌లో నెల రోజుల పాటు ఆంక్షలు.. ఇలా చేస్తే కఠిన చర్యలు!

‘ఏక్‌ పోలీస్‌’ విధానాన్ని అమలు చేయాలని బెటాలియన్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న సమయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో నెలరోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్టు సీవీ ఆనంద్ తెలిపారు. హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు, అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్న‌ట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేర‌కు ఆంక్షలు విధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నవంబర్ 28 వరకు

నేటి నుంచి నవంబర్ 28వ తేదీ వరకు సమావేశాలు, ర్యాలీలు, సభలు, ధర్నాలు, రాస్తారోకోల‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్టు పేర్కొన్నారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 163 కింద ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ఆంక్ష‌ల్లో భాగంగా ఐదుగురికి మించి ఒక‌చోట‌ గుమికూడితే క‌ఠిన‌ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయితే పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు అణచివేయాలని చూస్తోందన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button