Hyderabad Metro Services: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇక 5:30 నుంచే మెట్రో సేవలు
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక ఉదయం 5.30 గంటలక నుంచే మొదవలవుతాయని మెట్రో అధికారులు పేర్కొన్నారు. మెట్రో రైళ్లే ప్రయాణించేవారి సంఖ్య రోజురోజుకి పెరగడంతో.. నగర వాసుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ట్రాఫ్రిక్ కష్టాలకు చెక్ పెడుతూ, తక్కువ ధరలోనే మెట్రోలో ప్రయాణించే అవకాశం కల్పించిన హైదరాబాద్.. ప్రయాణికులకు మరో సదావాకాశాన్ని కల్పించింది. మఖ్యంగా ఉదయాన్నే ప్రయాణించే ఉద్యోగులకు ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణంగా మెట్రో 6గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే మార్నింగ్ 5.30 నుంచే మెట్రో సేవలు కొనసాగించాలన ఎప్పటి నుంచే డిమాండ్ ఉంది.
ఆసమయంలో తగిన రద్దీ ఉంటుందా లేదా అనే అనుమానంతో ఇంతవరకు అలాంటి ఆలోచనలు చేయలేదని అధికారులు తెలిపారు. కానీ ప్రతి శుక్రవారం నాడు 5.30 నడిపే మెట్రోకి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మార్నింగ్ 5.30 గంటలకు మూడు కారిడార్ల నుంచి తొలి మెట్రో ట్రైన్ బయల్దేరుతుందని మెట్రో అధికారులు తెలిపారు.