తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Invitation: చిన్నారుల క్యూట్ ఆహ్వానం… కేటీఆర్ స్పందన ఇదే!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ను కొందరు చిన్నారులు తమ ముద్దులొలికే మాటలతో సర్‌ప్రైజ్ చేశారు. చిన్నారుల ఆహ్వానం మేరకు వారి పాఠశాల వార్షికోత్సవానికి హాజరవుతానని చెప్పారు. స్వయంగా వారిని అభినందిస్తానంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

Also Read: నేడు ‘జగనన్న విద్యాదీవెన’ నిధులు విడుదల

మార్చి 3న హైదరాబాద్ మిలీనియమ్ స్కూల్ మూడవ వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేటీఆర్‌ను స్కూల్ విద్యార్థులు వీడియో సందేశంతో ఆహ్వానించారు. దీనిపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు ఆ రోజు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పటికీ చిన్నారుల క్యూట్ ఆహ్వానంతో మనసు మారిందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ తనకొచ్చిన అత్యంత క్యూట్ సందేశం ఇదేనన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button