తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

KCR: మార్చి 12 నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 12వ తేదీ నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలా పడ్డ కేసీఆర్.. లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా పది స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారట. ఈ క్రమంలోనే లోక్ సభ నియోజక వర్గాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలోనే కనీసం రెండు సభలు ఉండేలా చూసుకుంటున్నారట. మార్చి 12న కరీంనగర్ సభతో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ సభతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కలిగించాలని సీఎం భావిస్తున్నారు.

ALSO READ: ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

మరోవైపు ఆ పార్టీ కి చెందిన పలువురు ఎంపీల వరుస రాజీనామాలు కేసీఆర్ లో ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున 9 మంది ఎంపీలు గెలుపొందగా, ప్రస్తుతం ఆరుగురే మిలిలారు. రాములు, బీబీ పాటిల్, వెంకటేశ్ నేత ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మూడు స్థానాల్లో గెలుపును కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button