తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Kingfisher Beers: పండుగకి ముందు మందుబాబులకు షాక్.. తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు లేనట్లే..!

సంక్రాంతి పండుగకు ముందు తెలంగాణలో మందుబాబులకు షాక్ తగిలింది. రాష్ట్రంలో కింగ్‌ఫిషర్ బీర్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (టీజీబీసీఎల్)కు సరఫరాను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటనను విడుదల చేసింది. టీజీబీసీఎల్ 2019 నుంచి ధరలను సవరించకపోవడం వల్ల కంపెనీకి భారీ నష్టాలు వచ్చినట్లు పేర్కొంది. గత ఐదేళ్లుగా ధరల పెంపు చేయని కారణంగా కంపెనీ ఆదాయంలో గణనీయంగా తగ్గుదల నమోదైందని తెలిపింది. అంతేకాదు, గత సరఫరాలకు సంబంధించిన బకాయిలను సైతం ప్రభుత్వం చెల్లించలేదని యునైటెడ్ బ్రూవరీస్ స్పష్టంచేసింది.

బీర్ల ధరలపై ప్రభావం!

యునైటెడ్ బ్రూవరీస్ నిర్ణయం తెలంగాణలో బీర్ల సరఫరాపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశముంది. కింగ్‌ఫిషర్ బీర్ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. కింగ్‌ఫిషర్‌ లైట్‌, కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్, కింగ్‌ఫిషర్ అల్ట్రా, కింగ్‌ఫిషర్ అల్ట్రామాక్స్ వంటి బీర్లకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. వాస్తవానికి రాష్ట్రంలోని మొత్తం బీర్ విక్రయాల్లో దాదాపు 60 నుంచి 70 శాతం కింగ్‌ఫిషర్ బీర్ బ్రాండ్లదేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో బీర్ల అమ్మకాలు భారీగా పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button