తెలుగు
te తెలుగు en English
తెలంగాణ
Trending

KTR: ఈ మహా నగరానికిఏమైంది? కాంగ్రెస్‌ పాలనపై కేటీఆర్‌ ఫైర్‌

కాంగ్రెస్ పాల‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌రోసారి ధ్వ‌జ‌మెత్తారు. హ‌స్తం పార్టీ పాల‌న‌తో మ‌హా న‌గ‌ర‌మైన హైద‌రాబాద్‌లో శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా అదుపుత‌ప్పాయ‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ‌త్తాసు ప‌లికే ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు కూడా “ఈ నగరానికి ఏమైంది?” అని ఫ్రంట్ పేజిలో వార్తలు రాస్తోంది అంటే హైద‌రాబాద్ ప‌రిస్ధితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు.

కాంగ్రెస్ పవర్‌లోకి రాగానే గడియ గడియకు ప‌వ‌ర్ క‌ట్ ఏమిటీ? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. సేఫ్ సిటీగా ఉన్న మహానగరంలో క్రైమ్‌ రేట్‌ ఎందుకు పెరిగిపోతోంద‌న్నారు. ఇదేనా మీరు తెస్తానన్న మార్పు అని మండిపడ్డారు. విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి.. పదేళ్లు కష్టపడి పునాదులు వేస్తే.. అధికారంలోకి రాగానే ఆగం చేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్‌ నుంచి పల్లెటూరు వరకూ అంతటా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంటే.. కేవలం రాజధాని కాదని.. తెలంగాణ ఎకనమిక్ ఇంజన్ అని తెలిపారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే.. హైదరాబాద్ దెబ్బతినే పరిస్థితి ఉందన్నారు. దీని వల్ల రాష్ట్రానికి కష్టమే కాదు.. యావత్ దేశానికి కూడా నష్టం.. అంటూ కేటీఆర్ ట్విట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button