తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

KTR: ఫార్ములా ఈ-రేస్ కేసు.. సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు!

ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు షాక్ తగిలింది. ఈ కేసులో ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయం కొట్టేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. దీంతో కేటీఆర్ రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నారు.

ఎల్లుండి విచారణకు కేటీఆర్!

ఫార్ములా ఈ-రేసు కేసులో తెలంగాణ హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతో బేలా ఎం. త్రివేది ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో క్వాష్ పిటిషన్‌ను కేటీఆర్ విత్ డ్రా చేసుకున్నారు. ఈ మేరకు గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేపట్టే విచారణకు కేటీఆర్ హాజరుకానున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button