తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

KTR: ఫార్ములా-ఈ కార్ రేసింగ్ అంశంలో స్పందించిన కేటీఆర్.. ప్రభుత్వానికి స్ట్రాంగ్ కౌంటర్!

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై కేటీఆర్ స్పందించారు. రాష్ట్రానికి రూ. లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకు నాపై కేసు పెడతారా? అంటూ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

పాలన చేతగాకే తప్పుడు కేసులు!

‘ఫార్ములా-1 రేసింగ్‌ను నిర్వహించేందుకు అనేక దేశాలు పోటీ పడతాయి. అయితే, దానిని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు నిర్వాహకులు అంగీకరించకపోవడంతో ఫార్ములా-ఈ రేసింగ్‌కు మొగ్గు చూపాం. ఫార్ములా-1 రేసింగ్‌ తొలిసారి 1946లో జరిగింది. ఈ రేస్‌ నిర్వహణకు అనేక దేశాలు పోటీపడతాయి. భారత్‌లో ఫార్ములా-1 రేసింగ్ నిర్వహించాలని 2003లోనే చంద్రబాబు ఆశించారు. కానీ, నిర్వాహకులు సుముఖత చూపించకపోవడంతో సాధ్యం కాలేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత మళ్లీ నేను వాళ్లతో మాట్లాడాను. అయినా ప్రయోజనం లేకపోయింది. అందుకే ఎలక్ట్రిక్‌ వాహనాలతో నిర్వహించే ఫార్ములా-ఈ కారు రేసింగ్‌ నిర్వహించాం. పాలన చేతగాక సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. జైలుకెళ్లేందుకైనా నేను సిద్ధమే. జైల్లో పెడితే యోగా చేసి.. పాదయాత్రకు సిద్ధపడతా. రాజ్‌భవన్‌లో కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటవుతున్నాయి. ఆ రెండు పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్‌ను ఖతం చేసేందుకు యత్నిస్తున్నాయి. నన్ను విచారించేందుకు అనుమతివ్వడం గవర్నర్‌ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. నాపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపడితే ఎదుర్కొంటా. విశ్వనగరాల సరసన హైదరాబాద్‌ను చేర్చాలనే ఉద్దేశంతోనే ఫార్ములా-ఈ కారు రేసింగ్‌ను ఏర్పాటు చేశాం.’ అని అన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button