తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు!

తెలంగాణ రైతుల కష్టాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కరెంట్ కోతలతో రైతులు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ వీడియోను కవిత ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓ సభలో పాల్గొన్నారు. సభ జరుగుతుండగా కరెంట్ పోవడంతో అక్కడికి వచ్చిన నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. అసెంబ్లీలో పవర్ కట్.. అధికారిక మీటింగ్ లోనూ కరెంట్ కోత.. అంటూ కవిత ట్వీట్ చేశారు. జీవన్ రెడ్డి ఓ పేపర్ తో గాలి విసురుకుంటున్న వీడియోను షేర్ చేశారు.

Also Read: పీక్స్‌కు కాంగ్రెస్, బీఆర్ఎస్ వార్… KCR ఫ్యామిలీపై సెటైరికల్ ట్వీట్!

మీరే స్వయంగా ఫోన్‌ చేసినా కూడా కరెంటు రాలేదని… దీంతో మీకు ఎంత ఇబ్బంది కలిగిందో కనిపిస్తూనే ఉందని తెలిపారు. మరి కరెంట్ పైనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఇంకెంత ఇబ్బంది కలుగుతుందో అర్థమవుతోందా.. అంటూ జీవన్ రెడ్డిని కవిత ప్రశ్నించారు. కరెంట్ లేక పంటలు ఎండుతున్నాయని, అది చూసి రైతులు ఎంత ఆవేదన చెందుతున్నారో తెలుసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా మీరైనా కరెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రికి చెప్పండంటూ కవిత ట్వీట్ చేశారు.

6 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button