తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

NHRC: అల్లు అర్జున్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని షాక్!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తెలంగాణ పోలీసులకు, ప్రభుత్వానికి షాక్ తగిలింది. సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చిన రోజు రాత్రి ప్రేక్షకులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చెయ్యాల్సి వచ్చింది. ఈ ఘటన కారణంగా కాస్త అలజడి రేగింది. అయితే దీనిపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఘాటుగా స్పందించింది. థియేటర్ వద్ద ప్రేక్షకులపై లాఠీ చార్జ్ చేసినటువంటి పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు లాయర్ రామారావు దాఖలు చేసిన పిటిషన్‌ని విచారించిన కమిషన్ సభ్యులు, నాలుగు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీ జితేందర్‌కి ఆదేశాలు జారీ చేశారు.

షాక్ తిన్న పోలీసులు

కాగా.. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా వచ్చారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చి తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో రేవతి అనే అభిమాని మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు ఈ కేసులో హీరో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ను రద్దు చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఎన్‌హెచ్ఆర్‌సీ ఆదేశాలతో పోలీసులు షాక్ తిన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button