Pawan Kalyan: సీఎం రేవంత్‌ను కలిసిన పవన్.. వరద బాధితుల కోసం రూ. కోటి విరాళం అందజేత
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో రేవంత్‌ను కలిశారు. ఇటీవల తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయనిధికి పవన్ రూ. కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన చెక్కును అందజేసేందుకు పవన్ కళ్యాణ్.. సీఎం రేవంత్ ను కలిశారు. ఈ సందర్భంగా పవన్‌ను సీఎం రేవంత్ శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. అనంతరం వరద సహాయక చర్యలతో పాటు ఇరు రాష్ట్రాల అభివృద్దిపై కాసేపు చర్చించారు.
Also Read: ధైర్యాన్ని చంపే భయం ‘దేవర’.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్!
ఇటీవల తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడలో భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. చాలా మంది చనిపోయారు. జనం చాలా నష్టపోయారు. ఇలాంటి సమయంలో తమ వంతు బాధ్యతగా ప్రజలు, హీరోలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా.. డిప్యూటీ సీఎం, హీరరో అయిన పవన్ కళ్యాణ్ తన వంతు వరద సాయం ప్రకటించారు. ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆ మేరకు ఇవాళ చెక్కును అందించారు.