తెలుగు
te తెలుగు en English
Linkin Bioతెలంగాణ

Pawan Kalyan: గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చారు..! అల్లు అర్జున్ వివాదంపై పవన్ సంచలన వ్యాఖ్యలు!

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ వివాదం.. తదితర అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు స్పందించారు. మంగళగిరిలో మీడియాతో చిట్‌చాట్‌లో ఈ వివాదంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చారని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని అన్నారు. అలాగే ఈ ఘటనలో కేవలం అల్లు అర్జున్‌ని దోషిగా మార్చడం సరికాదన్నారు.

అందుకే ప్రజల్లో ఆగ్రహం!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారోనని అందరూ ఎదురు చూస్తున్న వేళ్ల ఈ అంశంపై ఆయన స్పందించారు. ‘అల్లు అర్జున్‌ విషయంలో తెర ముందు, వెనుక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. చట్టం అందరికీ సమానం. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టను. థియేటర్‌ స్టాఫ్‌ కూడా అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. పోనీ, సీట్లో ఆయన కూర్చొన్నాక అయినా, చెప్పి తీసుకెళ్లాల్సింది. అల్లు అర్జున్‌ తరఫున ఎవరో ఒకరు బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉంటే బాగుండేది. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు. మేమంతా అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది. ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది. అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. పరామర్శించకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన అర్జున్‌లో ఉంది. అలాగే ఈ ఘటనలో అల్లు అర్జున్‌ ఒక్కడినే దోషిగా మార్చడం కూడా కరెక్ట్‌ కాదు. తొక్కిసలాట ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి స్పందించారు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయి.’ అని అన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button