తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Ration card: రేషన్ కార్డు ఈ-కేవైసీ.. ఇవాళే లాస్ట్ డేట్

రేషన్ పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు, బోగస్ కార్డుల తొలగింపునకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డు ఈ-కేవైసీ ప్రక్రియ నేటితో ముగియనుంది. ముందుగా జనవరి 31 వరకు గడువు ఇవ్వగా, అనంతరం ఆ గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకూ పొడిగించారు. ఇంకా ఎవరైనా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వారు ఉంటే సమీపంలోని రేషన్ షాపుల్లోకి వెళ్లి ఈ-పోస్ యంత్రం ద్వారా వేలిముద్రలు సమర్పించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు చెప్పారు. లేదంటే వచ్చే నెల నుంచి రేషన్ సరఫరాను నిలిపి వేస్తామని స్పష్టంచేశారు.

ALSO READ: పాత డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు.. నేడు మెగా డీఎస్సీకి నోటిఫికేషన్!

ఎలా చేయాలంటే..

రేషన్ కార్డులో పేరున్న కుటుంబ సభ్యులు.. సమీపంలోని రేషన్ షాపునకు వెళ్లి మీ రేషన్ కార్డు నంబర్, వేలిముద్రలు సమర్పించాలి. మీ రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేస్తారు. అనంతరం ఈ-కేవైసీ పూర్తి చేసినట్లు ఈ-పోస్ మిషన్ నుంచి రసీదు వస్తుంది. రేషన్ కార్డుకు కలిగిన వాళ్లు రాష్ట్రంలో ఏ రేషన్ షాపు వద్దనైనా ఈ-కేవైసీ పూర్తిచేయవచ్చు. కుటుంబ సభ్యులు అందరూ ఒకేసారి వెళ్లి వేలిముద్రలు వేయాల్సిన అవసరంలేదని అధికారులు తెలిపారు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చని తెలిపారు. తెలంగాణలో ఇప్పటివరకు 80 శాతం మంది మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేయగా, ఇంకా 20 శాతం మంది పూర్తిచేయలేదు. ఈ-పోస్ యంత్రంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ-కేవైసీకి మరోసారి గడువు పొడగించాలని పలువురు కోరుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button