తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం సాయం!

తెలంగాణలో జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కసరత్తు ప్రారంభించింది. ఏటా 4.50 లక్షల ఇళ్లు నిర్మించి.. మొత్తంగా ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.7,740 కోట్లు కేటాయించారు. అయితే.. పేదల ఇళ్ల పథకం కోసం రాష్ట్ర ఖజానాపై భారీగా భారం పడుతుంది. దీంతో కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకొచ్చేలా రాష్ట్రం ప్లాన్ చేస్తుంది.

పేదల ఇళ్ల పథకం కోసం కేంద్ర నిధులు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు కేంద్రం విధించే నిబంధనలన్నింటినీ పాటించేందుకు అంగీకారం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోచన పథకం (పీఎంఏవై) కేంద్రం ఇళ్ల నిర్మాణానికి పెద్దఎత్తున సాయం చేస్తోంది. సాధ్యమైనంత వరకు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

పీఎంఏవై నిబంధనలు పాటించడమేగాక, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సమగ్ర సమాచారం రాష్ట్రం తరఫున కేంద్రానికి అందించేందుకు సిద్ధమైంది. కేంద్రం సాయంతో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కొనసాగించాలని భావిస్తోంది. దీంతో కేంద్రం విధించే మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. దీని ద్వారా వీలైనంత ఎక్కువమందికి లబ్ధి చేకూర్చడమే గాక.. భారీగా నిధులు రాబట్టాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button