తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: నేడు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ భేటీ… రేపు అభ్యర్థుల పూర్తి జాబితా!

తెలంగాణలో మే 13న లోక్ సభ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ కావడంతో బీఆర్ఎస్ లో కొంత గందరగోళం నెలకొంది. మరో వైపు బీఆర్ఎస్ లోని కొందరు కీలక నేతలు పార్టీ మారడం తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో లోక్ సభ అభ్యర్థుల ప్రకటన పై క్లారిటీ రావడానికి బీఆర్ఎస్ పార్టీకి ఇంక కొన్ని రోజులు పట్టేలా కనిపిస్తుంది. అలాగే బీజేపీ తెలంగాణలో ప్రచారంలో దూసుకుపోతుంది. అటు అమిత్ షా, ఇటు ప్రధాన మంత్రి మోడీ ఇప్పటికే ఇక్కడ ప్రచారం కూడా చేశారు. త్వరలోనే బరిలో నిలిచే పూర్తి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.

Also Read: ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టులో విచారణ… ఎస్‌బీఐకి కీలక ఆదేశాలు

అలాగే తెలంగాణ నుంచి లోక్‌సభ బరిలోకి దిగే కాంగ్రెస్ అభ్యర్థులు నేడు ఫైనల్ కానున్నారని తెలుస్తుంది. ఇప్పటికే నాలుగు స్థానాలు.. జహీరాబాద్, నల్గొండ, మహబూబాబాద్, చేవెళ్ల నుంచి బరిలోకి దిగే అభ్యర్థులను ప్రకటించగా, మిగిలిన 13 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఈ రోజు భేటీ కానుంది.

Also Read: రూట్ మార్చిన బాబు.. తిట్టిన నోటితోనే మోదీపై పొగడ్తల వర్షం!

ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశంలో అభ్యర్థులను ఫైనల్ చేసి రేపు ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నేతలు వలస వస్తున్న నేపథ్యంలో వారిలో బలమైన అభ్యర్థులకు టికెట్లు కేటాయించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైనట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button