తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్లకు మార్గదర్శకాలివే..!

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులకు 5లక్షల ఆర్థిక సాయాన్ని నాలుగు దశల్లో ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇక, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈనెల 11న సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రారంభించనున్నారు. ప్రతి ఏడాది 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు 3,500 చొప్పున మొత్తం 119 నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లు కేటాయించనుంది. మిగిలిన ఇళ్లను రాష్ట్ర రిజర్వు కోటా కింద ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏ ఏ దశల్లో ఎంత డబ్బులు ఇస్తుంది!

పునాది స్థాయిలో లక్ష రూపాయలు

రూఫ్ స్థాయిలో లక్ష రూపాయలు

ఇంటి పై కప్పు నిర్మాణం పూర్తయిన తర్వాత రూ. 2లక్షలు

నిర్మాణం మొత్తం పూర్తయ్యాక రూ.లక్ష చొప్పున చెల్లించనుంది.

అర్హులు ఎవరంటే!

రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడి ఎంపిక

లబ్ధి దారుడు విధిగా బీపీఎల్ (దారిద్ర్య రేఖ)కు దిగువన ఉన్న వారై ఉండాలి

లబ్ధి దారుడికి సొంత స్థలం ఉండాలి. లేదా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఉండాలి

వివాహమై ఉమ్మడి కుంటుంబంలో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక కావచ్చు.

అద్దె ఇంట్లో ఉంటున్నా లబ్ధిదారుడు కావచ్చు.

సింగిల్ ఉమెన్, వితంతువు మహిళలు లబ్ధిదారులు కావచ్చు

గుడిసె, గడ్డితో పైకప్పు నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన ఇల్లున్నా ఈ పథకానికి అర్హలే.

ఇక, ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరు మీదనే మంజూరు చేయనున్నారు.

సంబంధిత కథనాలు

Back to top button