తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్.. ఏ ఏ అంశాలపై చర్చించనున్నారంటే?

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనుంది. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో నిన్న ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆ తర్వా అసెంబ్లీ, తమండలిలో చర్చ జరగనుంది. ఈ అంశానికి తోడు కొత్త రేషన్ కార్డుల జారీపైనా కేబినెట్ చర్చించి విధివిధానాలను, షెడ్యూలును ఖరారు చేయనుంది.

గతేడాది డిసెంబర్ ఈ ఏడాది జనవరి మధ్య నిర్వహించిన ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్‌లో వచ్చిన అభయహస్తం దరఖాస్తుల్లో కొత్త రేషన్ కార్డుల జారీ రిక్వెస్టుపై స్పెషల్ కమిటీ ఇప్పటికే లోతుగా అధ్యయనం చేసింది. కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు జారీ చేస్తారంటూ.. అటు ప్రజల నుంచి ఇటు విపక్షాల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి నిర్దిష్టమైన విధివిధానాలను, అర్హతలను, జారీకి సంబంధించి షెడ్యూలును ఖరారు చేసే అవకాశముంది.

మరోవైపు హైదరాబాద్ అభివృద్ధితో పాటు మూసీ నది ప్రక్షాళన, మౌలిక సౌకర్యాల కల్పన, రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ తదితర పలు అంశాలకు సంబంధించి కూడా చర్చించనున్నట్లు తెలిసింది. ఇందులో కొన్ని పనులకు ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సాయం పొందాలని ప్రభుత్వం భావిస్తున్నందున కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వీటితో పాటు మరికొన్ని అంశాలను సైతం కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button