తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana Government: ‘వైఎస్ఆర్ పథకాలు ఎప్పటికీ నిలిచిపోతాయి.. రాహుల్ ప్రధాని కావడమే ఆయన ఆకాంక్ష’

రాహూల్ గాంధీ ప్రధాని కావాలన్నది వైఎస్ఆర్‌ కోరిక అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు గాంధీ భవన్ కి చేరుకున్నారు. వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వైఎస్ అమలు చేసిన సంక్షేమం.. తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. వైఎస్ పేరు వినిపిస్తే.. సంక్షేమం పేరు వినిపిస్తుందన్నారు. వైఎస్ఆర్ ముద్ర ప్రజలకు గుండెల్లో ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణ ప్రజలకు గ్యారెంటీ ఇచ్చిన స్ఫూర్తి ఆనాటి వైఎస్ఆర్ 2004లో అమలు చేసిన సంక్షేమం అన్నారు. వైఎస్ 2009లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు మాట్లాడిన అంశం నాకు ఇంకా స్పష్టంగా గుర్తుందని తెలిపారు. రాహూల్ గాంధీ ప్రధాని కావాలన్నది వైఎస్ కోరిక అన్నారు. వైఎస్ఆర్ పాదయాత్రనే రాహూల్ గాంధీ పాదయాత్రకు స్ఫూర్తి అన్నారు.

Read also: AP&TS: ఆ రెండు పార్టీలను తుడిచిపెట్టేయడమే లక్ష్యమా? రేవంత్, చంద్రబాబుల ప్లాన్ ఇదేనా?

ప్రధాని పదవికి ఒక్క అడుగు దూరంలో రాహూల్ గాంధీ ఉన్నారని రేవంత్ చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తేనే పేదలకు మేలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలని తెలిపారు. వైఎస్ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి ప్రతిజ్ఞ తీసుకుందామన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని పని చేసేవారే నిజమైన వైఎస్ఆర్ వారసులని తెలిపారు. నిన్నటికి నేను పీసీసీ బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు అన్నారు. ఈ మూడు సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నామన్నారు. ఎన్నికల్లో ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లు సాధించామన్నారు. కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని కార్పొరేషన్ పదవులు ఇచ్చామని తెలిపారు. పని చేసిన వారికే పదవులు దక్కాయని, పైరవీ కారులకు పదవులు ఇవ్వలేదన్నారు. కార్యకర్తలను కాపాడుకునే అంశంలో వైఎస్ఆర్ స్ఫూర్తి కొనసాగిస్తామన్నారు.

మరోవైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వైఎస్ ఆలోచన మార్గంలో ఈ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రజలకోసం అంకితమై పని చేస్తున్నామని తెలిపారు. వైఎస్ పాలన చిరస్థాయిలో నిలుస్తుందన్నారు. వైఎస్ పాదముద్రలు ఇంకా ఉన్నాయన్నారు. వచ్చే పదేళ్లు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ కి దూరంగా వెళ్లిన వారు ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ లోకి వస్తున్నారని తెలిపారు. ఇదే ప్రభుత్వ పాలనకు ఇచ్చిన గౌరవం అన్నారు. పార్టీ నుండి బయటకు వెళ్లిన వాళ్ళు అందరూ కాంగ్రెస్ లోకి రండి అని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ సర్కార్ ని ప్రజల దగ్గరికి తీసుకుపోదామన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేస్తామన్నారు. కాంగ్రెస్ కార్యకర్త తలెత్తుకుని తిరిగేలా పని చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button