తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Rythu Runa Mafi: అన్నదాతలకు తీపికబురు.. రెండోదశ రుణమాఫీకి రంగం సిద్ధం

రెండో విడత రైతు రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామన్న హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పుడు రెండో విడత రైతు రుణమాఫీకి సిద్ధమైంది. ఈ నెలాఖరులో రెండో విడత, వచ్చే నెల మొదటి వారంలో మూడో విడత నిధులు విడుదల చేస్తామన్న ప్రకారమే రేపు నిధులు విడుదల చేస్తుంది. రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే విషయమై ఆర్థిక శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. రేపు రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. లక్షన్నర లోపు రుణం ఉన్న రైతుల ఖాతాలోకి రేపు నిధులు పడుతాయని వెల్లడించింది. అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. సభలో రుణమాఫీ పై తెలంగాణ సర్కార్ చర్చ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు విశ్వనీయ సమాచారం. రేపు కూడా సభలో 19 శాఖల పద్ధులపై చర్చ నేపథ్యంలో ప్రకటన చేయాలని సర్కార్ భావిస్తుంది.

Read also: Uttam Kumar Reddy: కేటీఆర్‌ జోసెఫ్‌ గోబెల్స్‌గా పేరు మార్చుకోవాలి.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

అయితే మొదటి విడతలో లక్ష రూపాయల వరకు మాఫీ చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా కొంత మంది రైతుల ఖాతాల్లో నగదు పూర్తిగా జమ కావడం లేదని ఫిర్యాదులు అందుతుండటంతో దీనిపై మంత్రి తుమ్మల స్పందించిన విషయం తెలిసిందే. రెండో విడత రుణమాఫీలో భాగంగా రైతుల ఖాతాల్లో రూ.1.50 లక్షల వరకు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా కొంత మంది రైతుల ఖాతాల్లో నగదు పూర్తిగా జమ కావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని దీనిపై మంత్రి తుమ్మల వివరణ ఇచ్చారు. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణాలు ఉన్న రైతులకు మాఫీ అవుతుందని భావించగా కొంత మంది రైతుల ఖాతాల్లో సాంకేతిక సమస్యల వల్ల అది సాధ్యం కాలేదు. రుణమాఫీ సొమ్మును రిజర్వ్‌ బ్యాంకు ఈ- కుబేర్‌ విధానంలో జమ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 17 వేల 877 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 84.94 కోట్ల రూపాయలు జమ కాలేదన్నారు. ఆ నిధులు ఆర్‌బీఐ వద్దే ఉన్నాయని తెలిపారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button