తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: దమ్ముంటే టచ్ చేసి చూడు… బీజేపీ ఎమ్మెల్యేకి మంత్రి పొన్నం కౌంటర్

బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆరుగురు మంత్రులు బీజేపీతో టచ్ లో ఉన్నారని.. తాము గేట్లు ఎత్తితే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండంటూ మంత్రి పొన్నం ప్రభాకర్, మహేశ్వర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. మాది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమని… దేనినైనా ఎదుర్కొనే శక్తి తమ ప్రభుత్వానికి ఉందన్నారు. కొంతమంది మూర్ఖులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. బలహీన వర్గాలకు చెందిన బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించారని మంత్రి విమర్శించారు.

Also Read: లోక్ సభ ఎన్నికలకు దూకుడు పెంచిన బీజేపీ.. 27 మందితో మేనిఫెస్టో కమిటీ

బలహీన వర్గాలకు మేలు చేసేది కాంగ్రెస్ మాత్రమేనని పొన్నం స్పష్టంచేశారు. కనీసం పార్టీ పదువుల్లోనైనా బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. బీసీ యువతకు ఉచిత శిక్ష ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. నాలుగు నెలల్లోనే అనేక పథకాలను తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడిస్తామని.. రాష్ట్రంలో 14కు పైగా ఎంపీ స్థానాలను గెలుస్తామని మంత్రి పొన్నం ధీమా వ్యక్తం చేశారు.

Also Read: కడియం శ్రీహరిపై చర్యల దిశగా బీఆర్ఎస్… ఫలించేనా?

బీజేపీకి చేతనైతే 10 సంవత్సరాల్లో దేశ ప్రజలకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని మోడీ అవమానించారని దానిపై మీరు మాట్లాడారా అని నిలదీశారు. తెలంగాణ విభజన హామీలు నెరవేర్చారా అని ప్రశ్నించారు. 23 సంవత్సరాల చరిత్రలో బలహీన వర్గాలకు ఒక్క పదవి ఇచ్చిన పరిస్థితి లేదని విమర్శించారు. 1987లో డిగ్రీ కాలేజీలో ఏబీవీపీపై గెలిచిన వ్యక్తినని.. కలలో కూడా బీజేపీ ఉసెత్తనని తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button