తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: చెరపకురా చెడేవు .. టీ-కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్!

ఇటీవల కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ‘గేట్లు తెరవడం’ డైలాగ్ వార్ పీక్స్‌కు చేరింది. తాము గేట్లు ఓపెన్ చేశామని.. ఇక, బీఆర్ఎస్ లో ఎవరూ ఉండరని.. ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని మణుగూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఇక, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు ముగ్గురు మాత్రమే ఉంటారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఆలోచనతో బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందంతో పనిచేస్తున్నాయని ఆరోపించారు.

Also Read: తమిళిసై రాజీనామా ఆమోదం.. తెలంగాణ ఇంఛార్జ్ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్

తాము గేట్లు తెరిస్తే కాంగ్రెస్ లో ఒక్క ఎమ్మెల్యే మిగలడని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని ఫైర్ అయ్యారు. మీరు కొట్టినప్పుడు తాము తీసుకున్నామని… భవిష్యత్తులో తాము కొడతామని ఆ దెబ్బకు రేవంత్ లేవకుండా అవుతాడంటూ వార్నింగ్ ఇచ్చారు.

Also Read: ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీకి బీటలు!

ఇక, గేట్లు తెరవడంపై టీ-కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘చెరపకురా చెడేవు గేట్లు తెరవడం అంటే! మా ప్రభుత్వాన్ని కూలుద్దామని మీకు ఆలోచన వచ్చేలోపే, మీ పార్టీ కుప్ప కూలిపోతుందని అర్థమని ట్వీట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button