తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TG High Court: పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై విచారణ జరిపిన ధర్మాసనం నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది. బీఆర్ఎస్ నుండి పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, శ్రీహరిల పైన అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని గడువు విధించించింది. హైకోర్టు నిర్ణయం తీసుకోకపోతే ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఇదే క్రమంలో ఈ కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Also Read: ‘దేవర’ ప్రచారం.. ఎన్టీఆర్ కోసం రంగంలోకి హృతిక్ రోషన్..!

తీర్పుపై స్పందించిన కడియం

పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు వెలువరించిన తీర్పుపైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందన్నారు. ఈ వ్యవహారంలో అవసరం అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ కు అప్పీలు చేస్తామన్నారు. పార్టీ పెద్దలతోనూ, న్యాయ నిపుణులతోనూ చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని కడియం శ్రీహరి పేర్కొన్నారు. అంతేకాదు, పార్టీ ఫిరాయింపులపై ఒక్కొక్క కోర్టు ఒక్కో తీర్పును ఇస్తున్నాయని పేర్కొన్న కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుల పైన విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button