తెలుగు
te తెలుగు en English
Linkin Bioతెలంగాణ
Trending

Tollywood: సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన మరో టాలీవుడ్ నటుడు.. జైలు తప్పదా..?

రేవంత్ రెడ్డి పేరు నచ్చలేదో.. లేదా ఆయన పేరుకి, సీఎం పదవికి మ్యాచ్ అవలేదో తెలీదు గానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తరచూ సినీ పరిశ్రమ చేతిలో అవమానాలు ఎదురవుతున్నాయి. ఆదివారం హైదరాబాద్‌ హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టాలీవుడ్ నటుడు బాలాదిత్య ఆ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరించారు. అయితే రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలుకుతూ బాలాదిత్య నోరు జారారు. ‘మన ప్రియతమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కిరణ్‌ కుమార్‌ గారు’ అంటూ మాట్లాడారు. ఇలా ఒక్కసారిగా ఆయన కిరణ్ కుమార్ అని పిలవడంతో అక్కడున్నటువంటి వారందరూ కేకలు వేయగా తన తప్పును గ్రహించిన బాలాదిత్య తలకు చేయి పట్టుకొని అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. కాసేపటికి తిరిగి వేదిక పైకి వచ్చి క్షమించాలి అంటూ క్షమాపణలు చెబుతూ మరోసారి రేవంత్ రెడ్డికి స్వాగతం చెప్పారు. ఇక అదే కార్యక్రమంలో అలనాటి హీరోయిన్ జయసుధ స్టేజీపైకి వస్తున్న క్రమంలో అందరికీ నమస్కారం పెట్టారు కానీ సీఎం రేవంత్‌కి నమస్కారం పెట్టకపోవడం, పైగా సీఎంను చూడకుండా ముఖం తిప్పుకొని పోవడం చర్చనీయాంశంగా మారింది.

సోషల్ మీడియాలో వైరల్..!

ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వీడియోలపై ఎంతో మంది నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. లక్కీగా సీఎంలైతే ఇలాగే ఉంటుందని, రేవంత్ తన పేరు మార్చుకోవాలని కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం త్వరలోనే బాలాదిత్య, జయసుధ కూడా ఊచలు లెక్క పెట్టాల్సిందే అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. పుష్ప-2 సక్సెట్ మీట్‌లో సీఎం పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేవలం పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేస్తే.. మరి నమస్కారం పెట్టని జయసుధకు, రేవంత్ పేరుకు బదులు ఏకంగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం పేరును పలికిన బాలాదిత్య పరిస్థితి ఇంకొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button