తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TPCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌ కుమార్‌గౌడ్‌

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్ కుమార్ నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌కు కొత్త పీసీసీ అధ్య‌క్షుడిని నియ‌మించేందుకు కాంగ్రెస్ పార్టీకి 9 నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది.

ఇక, మహేశ్ కుమార్ గౌడ్ 2023లో పీసీసీ ఎన్నిక‌ల క‌మిటీ స‌భ్యుడిగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్నారు మ‌హేశ్ కుమార్ గౌడ్. ప్ర‌స్తుతం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా కొన‌సాగుతున్నారు. ఇక పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి మ‌ధుయాష్కీ గౌడ్, జీవ‌న్ రెడ్డి, జ‌గ్గా రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, అద్దంకి ద‌యాక‌ర్ పోటీ ప‌డ్డారు. కానీ చివ‌ర‌కు రేవంత్‌కు అత్యంత స‌న్నిహితుడైన మ‌హేశ్ కుమార్ గౌడ్‌ను పీసీసీ పీఠం వ‌రించింది. పీసీసీ అధ్య‌క్షుడు ఎవ‌ర‌నే క‌స‌ర‌త్తు రెండు వారాల క్రిత‌మే పూర్త‌యిన‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా నేడు ప్ర‌క‌టించింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button