తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TPCC: టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్

టీపీసీసీ చీఫ్‌గా ఇటీవల నియమితులైన మహేశ్ కుమార్ గౌడ్ ఇవాళ గాంధీ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులు హాజరయ్యారు. గాంధీ భవన్‌లోని ఆయన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణకు ముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి మహేశ్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు. అక్కడి నుంచి గాంధీ భవన్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షితో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా తన వంతు ప్రయత్నాలు చేస్తానన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button