తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS Elections: ఎంపీ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఎంపీ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఎంపీ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లోని గంగాధరలో శనివారం బండి సంజయ్ ప్రజాహిత యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రకటించి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా అని ప్రశ్నించారు. దమ్ముంటే ఎన్నికలకు ముందే ప్రధాని అభ్యర్థి పేరు ప్రకటించాలని ఛాలెంజ్ చేశారు.

ALSO READ: గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ

గండి కొట్టే అవకాశం

ఆరు గ్యారెంటీ స్కీములు ఎలా అమలు చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవని చెబుతూ సంక్షేమ పథకాలకు గండి కొట్టే అవకాశం ఉందన్నారు. ఇంతకుముందు పంట నష్టం పోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వకుండా మాజీ సీఎం కేసీఆర్ మోసం చేశారని, ఇప్పుడు సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావున రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button